GTK-Doc పొందుట
1.3.1. అవసరములు
Perl v5 - ముఖ్య స్క్రిప్టులు Perl1 నందు వున్నవి.
DocBook DTD v3.0 - ఇది DocBook SGML DTD. http://www.ora.com/davenport
Jade v1.1 - SGMLను వివిధ ఫార్మాట్ల లోనికి మార్చుటకు యిది DSSSL ప్రోసెసర్. http://www.jclark.com/jade
Modular DocBook Stylesheets DocBookను HTMLకు (యింకా కొన్ని యితర ఫార్మాట్లకు) మార్చుటకు యిది DSSSL కోడ్. ఇది jadeతో కలిపి వుపయోగించబడును. నేను DSSSL కోడ్ను కొద్దిగా మలచుకొనినాను, gtk-doc.dsl నందు, ప్రోగ్రామ్ కోడ్ జాబితాలు/డిక్లరేషన్లను రంగులో వుంచుటకు, మరియు జనియింపచేసిన HTML నందు గ్లోబల్ క్రాస్-రిఫరెన్సెస్ యిండిసెస్ను మద్దతించుటకు. http://nwalsh.com/docbook/dsssl
docbook-to-man - DocBook నుండి man పేజీలను సృష్టించాలని అనుకొంటే. నేను 'translation spec' ను కొద్దిగా మలచుకొనినాను, విభగాపు హెడ్డింగులను పెద్దఅక్షరములలో వుంచుకొనుటకు మరియు పేజీల యొక్క పైభాగమున 'GTK Library' శీర్షికను జతచేయుటకు మరియు క్రిందన పునఃపరిశీలన తేదీను వుంచుటకు. దీనికి http://www.ora.com/davenport పైన వొక లింకు వుంది. గమనిక: ఇంది యింకా పనిచేయుటలేదు.
1.3.2. సంస్థాపన
DocBook మాడ్యులర్ స్టైల్షీట్లు యిక్కడ సంస్థాపించాలని వొక ప్రామాణిక స్థలము యేమీలేదు.
GTK-Doc యొక్క ఆకృతీకరణ స్క్రిప్టు ఈ 3 డైరెక్టరీలను స్వయంచాలకంగా శోధిస్తుంది:
/usr/lib/sgml/stylesheets/nwalsh-modular (RedHat ద్వారా వుపయోగించబడింది)
/usr/lib/dsssl/stylesheets/docbook (Debian ద్వారా వుపయోగించబడింది)
/usr/share/sgml/docbkdsl (SuSE ద్వారా వుపయోగించబడింది)
మీరు యెక్కడోవొకచోట స్టైల్షీట్లను సంస్థాపించివుంటే, మీరు GTK-Docను ఈ ఐచ్చికము వుపయోగించి ఆకృతీకరించవలసి వుంటుంది: --with-dsssl-dir=<PATH_TO_TOPLEVEL_STYLESHEETS_DIR>